Sunday, April 28, 2024

NZB: రోడ్డు ప్రమాదాల నివారణపై తెచ్చిన కొత్త చట్టాన్ని సవరించాలి..

నిజామాబాద్ సిటీ, జనవరి 1 (ప్రభ న్యూస్): రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే సవరించి, డ్రైవర్లకు న్యాయం చేయాలని డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి.దావూద్ అలీ (బాబుజానీ), ప్రధాన కార్యదర్శి నవీద్ పాషా, యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ‌ నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ వెహికల్ పార్కింగ్ వద్ద డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని వదిలి.. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలో గడిపే డ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వాపోయారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై తీసుకువచ్చిన చట్టంలో 10సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్షల రూపాయల జరిమానా విధించడంపై డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించమని యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు వసుదేవ్ సా, జాయింట్ సెక్రెటరీ అనిల్, యూనియన్ సభ్యులు అఫ్జల్, ఫెరోజ్, ఫాహీమ్, రాజు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement