Sunday, April 28, 2024

NZB: ఎన్నికల కోడ్ కు ముందే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి.. బీజేపీ కార్పొరేటర్ల వినతి

నిజామాబాద్, మార్చి 12 (ప్రభ న్యూస్) : గత బడ్జెట్ సమావేశంలో నగరంలోని పలు సమస్యలపై చర్చించే అవకాశం రాలేదని ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఎన్నికల కోడ్ రాకముందే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను బీజేపీ కార్పొరేటర్లు కోరారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బీజేపీ కార్పోరేటర్లు మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు.

డివిజన్ లో అభివృద్ధి పనులకు ఒక్కో డివిజన్ కు రూ.10లక్షలు కేటాయించడంపై సరైన స్పష్టత రాలేదన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న డివిజన్ కి కోటి రూపాయల అభివృద్ధి పనులపై చర్చించేందుకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, ప్రవళిక, ఆకుల హేమలత, మల్లేష్ యాదవ్, మెట్టు విజయ్, బంటు వైష్ణవి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement