Friday, May 3, 2024

పైరవీలకు తావులేకుండా ఆసరా ఫించన్లు : మంత్రి నిరంజన్‌ రెడ్డి

పైరవీలకు తావులేకుండా ఆసరా ఫించన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తున్నామన్నామ‌ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. పెన్షన్లు కోసం ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వొద్దన్నారు. ఈ విడతలో కూడా పింఛన్లు రాని వారు ఆందోళన చెందవద్దు. తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెన్షన్స్‌ మంజూరు చేయిస్తామన్నారు. అందరికి మేలు జరగాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. తెలంగాణలో దాదాపు 50 లక్షల ఫించన్లు అందజేస్తున్నామన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. తెలంగాణ తరహా పథకాలు అమలు చేయలేక ఈర్ష్యతో రాష్ట్ర ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. కేంద్రం జీఎస్టీ పేరుతో రాష్ట్రాల సొమ్ములు వెనకేసుకుని తిరిగి ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement