Thursday, May 2, 2024

NZB: గ్యారంటీ పథకాల అమలు కోసమే ప్రజా పాలన….. జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన సదస్సు కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు కౌంటర్ల ద్వారా తీసుకున్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ప్రజా పాలన సదస్సులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనవరి 6 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన సదస్సులు కొనసాగుతాయని తెలిపారు. ఇట్టి సదస్సులో ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే దరఖాస్తు ద్వారా స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసినా కౌంటర్లలో ప్రజలు దరఖాస్తులు ఇవ్వాలని చెప్పారు. రేషన్ కార్డు లేని వారి కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అట్టి కౌంటర్లలో దరఖాస్తులు ఇవ్వాలని ఆయన సూచించారు దరఖాస్తుల స్వీకరణలో సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. హరులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ప్రజలు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఆయన వెంట మండల అభివృద్ధి అధికారి అనంతరావు, గ్రామ సచివాలయ కార్యదర్శి గంగాధర్, పట్టణ సర్పంచ్ వేణు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement