Sunday, April 21, 2024

NZB: కాంగ్రెస్ లో నయా జోష్.. అర్బన్ లో ఇద్దరు నేతలకు కీలక పదవులు

నిజామాబాద్, ఫిబ్రవరి 16 (ప్రభ న్యూస్): నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు దిగ్గజ నేతలకు కీలక పదవులు దక్కడంతో కాంగ్రెస్ క్యాడర్లో నూతన ఉత్తేజం నింపింది. ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా నిజామాబాద్ వచ్చిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులుగా నియమింపబడి మొదటి సారిగా శుక్రవారం నిజామాబాద్ వచ్చిన మహమ్మద్ షబ్బీర్ అలీలకు ఇందూర్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా గజమాలలతో సన్మానిస్తూ ఘన నీరాజనం పలికారు. గల్లిగల్లిలో మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు.

ప్రధాన వీధుల గుండా స్వాగత ర్యాలీ..
బోర్గాం నుంచి స్వాగత ర్యాలీ ప్రారంభమై పులాంగ్ చౌరస్తా, గోల హనుమాన్ జండా గల్లి పెద్ద బజార్ నెహ్రూ పార్క్ బస్టాండ్, కోర్టు చౌరస్తా మున్నూరు కళ్యాణ మండపం వరకు స్వాగత ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, బోధన్ శాసనసభ సభ్యులు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరం మొత్తం నేతల స్వాగత ఏర్పాట్ల ఫ్లెక్సీలతో సందడి నెలకొంది. ప్రధాన వీధుల్లో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి.

మహమ్మద్ షబ్బీర్ అలీకి ఘన సన్మానం..
ప్రభుత్వ సలహాదారులుగా నియమింపబడి నిజామాబాద్ కి మొదటిసారి వచ్చిన మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఇందల్వాయి టోల్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైసా ఎల్లయ్య, సీనియర్ నాయకులు ఈర్ల శేఖర్, కోనేరు సాయికుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement