Saturday, April 27, 2024

ఎంపీ అరవింద్ కు రైతుల సెగ‌.. రాజీనామాకు డిమాండ్..

నిజామాబాద్ : పసుపు పంటను ఏడాది పాటు రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండిస్తున్నార‌ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ‌ల్ల పసుపు రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని రాష్ట్ర రైతుల సంఘం అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. కోటపాటి ఆధ్వర్యంలో పసుపు రైతు నాయకులు నిజామాబాద్ మార్కెటు యార్డును శనివారం సందర్శించారు. జిల్లాలో40 వేల మంది రైతులు 50 వేలకు పైగా ఎకరాలలో సాగు చేసిన పసుపు పంటకు ధర రాక పోగా రోజురోజుకు ధర పడిపోతున్న నేపథ్యంలో “తెలంగాణ పసుపు రైతుల సంఘం” నాయకులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వాలు కల్పించుకొని గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి జిల్లా అధ్యక్షులు పాట్కారి తిరుపతిరెడ్డి, మంథని నవీన్ రెడ్డి, నక్కల చిన్నారెడ్డి , తదితరులు పాల్గొన్నారు. పసుపు కు మద్దతు ధర, పసుపు బోర్డు తేవడంలో విఫలం అయిన నిజామాబాద్ ఎంపీ వెంటనే స్పందించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రెండు సంవత్సరాల క్రితం కొద్దిగా ధర వచ్చినప్పుడు, ఎంపీ తన వలనే ధర వచ్చింది. స్పెషల్ వ్యాగన్ లు పెట్టి పసుపును బంగ్లాదేశ్ కు ఎగుమతి చేయడం వల్లనే ధర వచ్చింది అని ఆరోజు ప్రకటనలు ఇచ్చుకొన్నారు. మరి ఈరోజు 4000 వేలు 5000 కంటే ఎక్కువ ధర రావడం లేదు. 5000 కంటే ఎక్కువ ధర రావడం లేదు ఇప్పుడు ఎగుమతి చేయడానికి వ్యాగన్ దొరకడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ఆంధ్రప్రదేశ్ లో మార్క్ ఫెడ్ ద్వారా 6800/- ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది . అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మార్క్ ఫెడ్ కు ఆదేశాలు ఇచ్చి 10.000/- మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది, కేంద్రానికి ఎంఐఎస్ క్రింద కొనుగోలుకు డిమాండ్ చేస్తూ లేఖ పంపాలి. తద్వారా మార్క్ ఫెడ్ కు జరిగె నష్టాన్ని కేంద్రం, రాష్ట్రం చేరి సగం పంచుకొనే వీలు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ వెంటనే కేంద్ర బడ్జెట్ లో 100 కోట్లు కేటాయింప చేసి పసుపు బోర్డు తెవాల‌న్నారు. రైతుల సమస్యలకు ఎంపీ బాధ్యత వహించాలని లేదా భవిష్యత్తులో ఎంపీకి పసుపు రైతుల తగిన గుణపాఠం చెబుతారని కోటపాటి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement