Sunday, April 28, 2024

NZB: అవినీతి బయటపడుతుందనే భయంతోనే పిచ్చి వ్యాఖ్యలు.. మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, జనవరి 22 (ప్రభ న్యూస్) : గ‌త ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి బయటపడు తుందనే భయంతోనే కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లా డుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన పిసిసి ఉపాధ్య క్షులు తాహెర్ బిన్ హందాన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు లు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులుగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలను, పాపాలను నిర్వీర్యం చేసిన వ్యవస్థలు అన్నింటిని ఒక దారిలో పెడుతుందని, కానీ కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ వాళ్ళ డొల్లతనం అవినీతి బయటపడుతుందో అని భయ పడి ఒకరు కరెంటు బిల్లు సోనియాగాంధీ కి పంపుతామని, ఒకరు 4000 పెన్షన్ ఏమైందని పిచ్చికూతలు కూస్తున్నారని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలుగా నిరు ద్యోగ భృతి పేరుతో, పేపర్ లీకే జీలతో ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ నాయ కులు ఇదే విధంగా ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై తరిమి కొడతారని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో కైసర్,సర్దార్ నరేంద్ర సింగ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement