Friday, May 3, 2024

Nzb: కేసీఆర్ రైతు పక్షపాతి.. మేయర్ నీతు కిరణ్

నిజామాబాద్ సిటీ, జులై 12 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా… ఉచిత పథకాలు, ఉచిత 24 గంటల కరెంటుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ… ప్రస్తుతం రైతులు సుఖసంతోషాలతో ఆత్మహత్యలకు పాల్పడకుండా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని… రైతన్నల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా రైతుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.. కానీ బిజెపి ఒకవైపు మోటార్లకు మీటర్లు పెడదామని, మరోవైపు కాంగ్రెస్ 24 గంటల కరెంటుపై .. ఉచిత పథకాలపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.  రైతన్నలపై రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో తన మనసులో మాటనే స్పష్టమైందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే… ప్రతిపక్షాలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు.. రైతన్నలు మేలుకొని రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సిర్పా రాజు, బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్, చింతకాయల రాజు, కొండా మురళి, ప్రవీణ్ గౌడ్, అంబాదాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మంజుల యాదవ్, ఎనుగందుల మురళి, కార్పొరేటర్ ధరంపురి, చాంగు భాయ్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement