Thursday, May 2, 2024

NZB: అరకొర కరంట్ సరఫరాపై రైతుల రాస్తారోకో

జుక్కల్(కామారెడ్డి): తెలంగాణా ప్రభుత్వం నుండి రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ఆదేశాలు ఉన్నప్పటికీ జుక్కల్ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా 12 గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవటంతో ఆగ్రహించిన రైతులు జుక్కల్ సబ్ స్టేషన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండిపోయిన పత్తి చెట్లను సైతం తీసుకొచ్చారు. వర్షాలు పడకపోవడం, విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవటంతో పత్తి పంట ఎండిపోయిందని, రబీ సీజన్ లో ఇతర పంటలు వెయ్యటానికి భూమిలో తడి లేకపోవటం పంటపొలాలు అత్యవసరంగా నీటి సరఫరా అవసరం ఉన్న సమయంలో విద్యుత్తు సరఫరా సరిగ్గా లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాస్తారోకో వల్ల ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. విద్యుత్ ఏఈ మోహన్, ఎస్ఐ సత్యనారాయణ రాస్తారోకో వద్దకు చేరుకొని లోడ్ ఎక్కువగా ఉండటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, మెరుగైన విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement