Sunday, April 28, 2024

TS : ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ… కలెక్టర్ హనుమంతు…

నిజామాబాద్ ప్రతినిధి, మార్చి17 (ప్రభ న్యూస్) : పార్లమెంటు ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణం లో, పారదర్శ కంగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నిక ల షెడ్యూల్ వెలువడిన సంద ర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యం సమావేశ మందిరంలో కలెక్టర్, సీ.పీలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ, భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువ రించిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చిందని, జూన్ 6 వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26 న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సీఎంసీ కళాశాలలో కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. 2019పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కూడా సీఎంసీ లోనే చేపట్టినప్పటికీ కేవలం నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను మాత్రమే ఇక్కడ లెక్కించారని, పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాల ఓట్లను జగిత్యాలలో లెక్కించడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి మాత్రం నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన ఓట్లన్నీ ఒకేచోట సీఎంసీ లోనే కౌంటింగ్ జరుపుతామని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ సహా జిల్లా పరిధిలో మొత్తం ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున అనుమ‌తులు లేకుండా ఎటువంటి స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని సూచించారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న మీదటే సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

- Advertisement -

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల‌లో ప్రత్యేక నిఘా … సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల‌లో అదనపు పోలీసు బలగాలతో పాటు, ప్రత్యేక నిఘా ఉంటుందని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. పరిస్థితులను బట్టి పోలింగ్ నాటికి వీటి సంఖ్య మారే అవకాశాలు ఉంటాయన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు జిల్లాలో మొత్తం 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటిలో అంతర్రాష్ట్ర సరిహద్దులలో నాలుగు ఉమ్మడి తనిఖీ కేంద్రాలు ఉండగా, జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో ఆరు చెక్ పోస్టులు, జిల్లాలోనే స్థానికంగా వివిధ ప్రాంతాలలో మరో ఎనిమిది తనిఖీ కేంద్రాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగిన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు తో ప్రయాణించవద్దని, తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆ కమిటీకి తగిన ఆధారాలు సమర్పించినట్లయితే గ్రీవెన్స్ కమిటీ వాటిని పరిశీలించి నగదు విడుదల చేస్తుందని తెలిపారు. తనిఖీ బృందాలకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ ఐ.ఏ.ఎస్ కిరణ్మయి, ట్రైనీ ఐ.పీ.ఎస్ చైతన్య రెడ్డి, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement