Sunday, May 26, 2024

Bikkanur – భగవంతు రెడ్డి స్మారక వాలీబాల్ పోటీలు

బిక్కనూర్ అక్టోబర్ 23 ప్రభా న్యూస్…. బిక్కనూరు వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ గా పనిచేసిన భగవంతు రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని అంతంపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు అన్నారు. సోమవారం గ్రామంలో ఆయన పేరున స్మారక వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున పోటీలలో పాల్గొన్నారు

అంతకుముందు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. గ్రామానికి చెందిన భగవంతు రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్గా పని చేస్తూ ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు.

గోల్కొండ సంతోష్ రెడ్డి వల్లకొండ తిరుపతిరెడ్డి వలకొండ రామ్ రెడ్డిలు వాలీబాల్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధుమోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మంజుల సంజీవరెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ గంగారెడ్డి ,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, నాయకులు పోచయ్య, సాగర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజిరెడ్డి, సాయిరెడ్డి, రాములు, గోపాల్, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement