Sunday, April 28, 2024

NZB: ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ..

నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి23 ప్రభ న్యూస్ : తెలంగాణ యూనివర్సిటీ సారంగపూర్ లోని బీఈడీ కళాశాలలో బీఈడీ మూడవ సెమిస్టర్ కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుచుండగా ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంట చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.

అందులో భాగంగా హాజరుకాని విద్యార్థులకు ఆబ్సెంట్, ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను మందలించడం జరిగింది. అధ్యాపకులకు కూడా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచనలు చేశారు. ఎప్పుడూ ఈ విధంగానే తనిఖీలు చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తే వ్యవస్థలో కొంత మార్పు వస్తుందని, విద్యారంగంలో మార్పులు వస్తాయని అధ్యాపకుల చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement