Sunday, April 28, 2024

ఎంపి అరవింద్ వ్యవహార శైలిపై కార్యకర్తల ఆగ్రహం

నిజామాబాద్ (ప్రభ న్యూస్) పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .పార్టీ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ జిల్లాకు చెందిన పలువురు కార్య కర్తలు ఆందోళన చేపట్టారు. బోధన్, ఆర్మూర్ బాల్కొండ కార్య కర్తలు బుధ వారం ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీ మండల శాఖల అధ్యక్షులు మార్పుపై స్థానిక నాయకత్వాలతో చర్చించకుండానే నియ మించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల 13 మండలాలకు చెందిన అధ్యక్షులను ఏక పక్షంగా నియమించడం పార్టీ స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీ నిబంధనల ప్రకారం మండల అధ్యక్షుడుగా నియమించాలంటే క్రియాశీల సభ్యత్వం కలిగి ఉండాలి. క్రియాశీల సభ్యత్వం గల వ్యక్తి కనీసం వంద మందితో పార్టీ సభ్యత్వాన్ని చేర్పించాల్సి ఉంటుంది ఈ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా అరవింద్ ఏకపక్షంగా ఎంపిక చేశారు.

ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించకపోవడంతో నాయకులు రాష్ట్ర కార్యాలయానికి తరలి వెళ్లారు. పార్టీలో పని చేస్తున్న వారికి ఏ మాత్రo సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడ్డారు. పార్టీని పార్టీ సిద్ధాంతాలను కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్తవారిని పార్టీ అధ్యక్షులుగా నియమించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలను నిర్లక్షం గా వ్యవహరించడం సహించేది లేదని అన్నారు. పార్టీ కార్యకర్తలపై గతంలో కూడా అరవింద్ వ్యవహార శైలిపై తీవ్ర నిరసనలు వ్యక్టం అయ్యాయి.

నియోజకవర్గ కన్వీనర్లు నియామకంలో కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.మండల అధ్యక్షులుగా పని చేసిన వారు రాజీనామా చేయడానికి సైతం సిద్ధం కావడంతో జిల్లా నాయకత్వం వారికి నచ్చజెప్పింది.సోషల్ మీడియా ద్వార అధ్యక్షులను నియామకాన్ని ప్రకటించడం కొత్త ఓరవడికి అరవింద్ శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. మండల అధ్యక్షులను నియమించే క్రమంలో క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది సమావేశంలో అధ్యక్షులను ఎన్నుకోవాల్సిన ఉంటుంది.

అధ్యక్ష పదవి కోసం ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే మరోసారి వారి అందర్నీ కూర్చోబెట్టి చర్చించి ఒకరిని ఎన్నుకునే విధంగా జిల్లా యంత్రాంగం పార్టీ నాయకులు చర్యలు తీసుకుంటారు ఈ విధానానికి స్వస్తి చెప్పి అరవింద్ తనకు నచ్చిన వారిని అధ్యక్షులుగా ఎంపిక చేయడం సరికాదన్నారు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న తాము జిల్లా అధ్యక్షుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో రాష్ట్ర కార్యాలయానికి రావలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అరవింద్ వ్యవహార శైలి పూర్తిగా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు రద్దు చేసిన మాజీ అధ్యక్షులు అందరిని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ అధ్యక్షుడు లక్ష్మణులు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తామని నాయకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement