Wednesday, May 15, 2024

Nizamabad | పార్లమెంట్ ఎన్నికల్లో 51 శాతం ఓట్లే లక్ష్యంగా పనిచేయాలి..

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : పార్లమెంట్ ఎన్నికల్లో 51 శాతం ఓట్లే లక్ష్యంగా పనిచేయాలని, రాబోయే పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ (పల్లెకు పోదాం అభియాన్) కార్యక్రమం చేపట్టినట్టు గావ్ చలో అభి యాన్ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన పల్లెకు పోదాం అభియాన్ పై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని వివరించాలన్నారు. పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పల్లెల్లోని గడప గడపకు బిజెపిని, ప్రధాని మోడీ విధానాలను చేరవేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలయ్యే వరకు కార్యకర్తలు విశ్రమించొద్దని కోరారు.

కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, గావ్ చలో అభియాన్ జిల్లా కన్వీనర్ స్వామి యాదవ్, జిల్లా సహా కన్వీనర్లు సందీప్ కుమార్, యామాద్రి భాస్కర్, పార్టీ మండల అధ్యక్షులు, అభియాన్ కన్వీనర్లు, సహ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement