Monday, April 29, 2024

Nizamabad – ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్…

నిజామాబాద్ రూరల్ – డిసెంబర్29 ప్రభ న్యూస్ – రూరల్ మండలం లోని కేశ పూర్ ధర్మారం బీ గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించి పరిశీలించారు. రాష్త్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజా పాలన లో మహాలక్ష్మి గృహ లక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల చేయూత పథకాల కు సంబంధించి దరకాస్తులు చేసుకోవాలని ప్రజా పాలన కార్యక్రమం లో దరఖాస్తులు ఇవ్వనివారు గ్రామ పంచాయితీ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

గృహజ్యోతి పతకం ద్వారా 2 వందల యూనిట్ల ఉచిత విద్యుత్ చేయూత పథకం ద్వారా నెలకు4 వేల ఫించన్ దివ్యంగులకు 6 వేల పించన్ అందజేయ నునట్లు కలెక్టర్ తెలిపారు రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు ఏడాదికి 15 వెలు ఎకరాకు అందజేస్తార ని వివరించారు. ఎం పి వో మధురిమ గ్రామ సర్పంచ్ సెక్రటరీ పంచాయతి సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement