Sunday, May 19, 2024

Nizamabad – ఎన్నికల సిత్రాలు: కారుపై ఒకరు…. సైకిల్ పై మ‌రొకరు వ‌చ్చి నామినేషన్ దాఖలు

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)9: నిజాంబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఒకరు అంబాసిడర్ కారుపై మరొకరు సైకిల్ పై వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అంబాసిడర్ కారుపై గణేష్ బిగాల

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా
తన సెంటిమెంట్ కారైన అంబాసిడర్ కారులో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాలా మాట్లాడుతూ నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి అని అర్బన్ ప్రజలను కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.

సైకిల్ పై అర్బన్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఎమ్మె ల్యే అభ్యర్థి శివకుమార్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఎమ్మె ల్యే అభ్యర్థి శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి నామి నేషన్ వేసేందుకు సైకిల్ పై రావడం ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్యలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపాలని నిజామాబాద్ నగర ప్రజలను కోరారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికి ప్రజలు అండగా నిలవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement