Tuesday, April 30, 2024

Nirmal – కెసిఆర్ కుటుంబ దొంగల ముఠాను ఇంటికి సాగనంపాలి – ఓటర్లకు రేవంత్ పిలుపు

నిర్మల్ ప్రతినిధి నవంబర్ 15 ప్రభా న్యూస్ ) తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల నుండి కమిషన్ దండుకుంటున్న కెసిఆర్ కుటుంబ మూటను వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా ఇంటికి సాగనంపండి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు .. బుధవారం జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ వద్ద కాంగ్రెస్ విజయభేరి సభలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రంగాల నుండి కెసిఆర్ కుటుంబం కమిషన్ను దండుకుంటున్నారని కెసిఆర్ దొంగల ముఠా ను వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం రోజున కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని పేర్కొన్నారు.” ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించి బొందపెట్టడానికి వేలాదిగా తరలి వచ్చిన మీకు అభినందనలు .తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది…అందుకే జెండాలు ఎజెండాలు, గ్రూపులు గుంపులు పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలి. ఆనాడు చెప్పిన.. ఈనాడు చెబుతున్నా.. కొడంగల్ లాగే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం.ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు..మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైంది..ఆదిలాబాద్ ఎడారిగా మారింది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ మీ మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఎన్నికల కోసం మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు.మళ్ళీ బీఆరెస్ గెలిస్తే మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకుంటరు.. మంత్రిగా ఉండి కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు.అలాంటి ఇంద్రకరణ్ రెడ్డిని ఎందుకు ఓటు వేయాలి.. నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావుకు ఒక్క అవకాశం ఇవ్వండి… శ్రీహరిరావుకు ఓటు వేస్తే.. రేవంతన్నకు వేసినట్లే.. సోనియమ్మకు వేసినట్లే..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత మాది.. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం..ఔర్ ఏక్ దక్కా.. కాంగ్రెస్ పక్కా.. అనే నినాదంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగి ఓటర్లలో విశ్వాసం నింపాలని ” సూచించారు.

ఈ బహిరంగ సభలో బలరాం నాయక్. నాయకులు అర్జుమన్. పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి. మల్లారెడ్డి. చారులత తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement