Sunday, April 14, 2024

మా ఓట్లన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కే … నాయిబ్రాహ్మణ సంఘం ఏకగ్రీవ తీర్మానం..!

మంచిర్యాల జిల్లా – చెన్నూరు నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బాల్క సుమన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అభివృద్ధి, సంక్షేమం లో చెన్నూరు నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తున్న బాల్క సుమన్ కి అండగా ఉంటామని తీర్మానాలు చేస్తున్నారు. ఇవాళ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సంఘం సభ్యులు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కి పూర్తి మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తమ ఓట్లన్నీ మూకుమ్మడిగా సుమన్ కే వేస్తామని ప్రమాణ పూర్వకంగా తీర్మానం చేశారు. కేసీఆర్ పాలనలోనే తమకు అన్ని విధాలా న్యాయం జరిగిందని, సుమన్ నాయకత్వం లోనే చెన్నూరు ప్రగతి పథం లో పయనిస్తోందని నాయి బ్రహ్మణులు వెల్లడించారు. ఉద్యమ పార్టీ కి, ఉద్యమ నేతకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు మామిడి పోచం, పట్టణ అధ్యక్షుడు వేయి కండ్ల మహేష్, ప్రధాన కార్యదర్శి వేయి కండ్ల నాగ నాగరాజు, ఉపాధ్యక్షులు మామిడి బాపు, కోశాధికారి శ్రీరాముల అశోక్ తో పాటు కుల. పెద్దలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement