Monday, April 29, 2024

మూసీ ప్రాజెక్టుకు తగ్గిన వరద

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం 637.80 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ఇప్పుడు 2.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement