Sunday, April 28, 2024

Komatireddy Venkatareddy – రేపు విడుద‌ల కానున్న కాంగ్రెస్ అభ్య‌ర్ధుల రెండో జాబితా

న‌ల్గొండ – కాంగ్రెస్ త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్ధుల రెండో లిస్ రేపు విడుద‌ల కానున్న‌ట్లు ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెలిపారు.. ఈ రోజు అభ్య‌ర్ధుల వ‌డ‌పోత కార్య‌క్ర‌మం పూర్తి అవుతుంద‌ని పేర్కొన్నారు.. మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ‌లో మార్పును కోరుకుంటున్నార‌ని , దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు వివిధ పార్టీల నేత‌లు క్యూక‌డుతున్నార‌ని అన్నారు.. త‌న‌న సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి చేరిక విషయం నాతో మాట్లాడలేద‌ని, నేరుగా అధిష్టానంతోనే ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపార‌ని చెప్పారు.. త‌న త‌మ్ముడుతో పాటు అనేక‌మంది కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నార‌ని, తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement