Tuesday, October 8, 2024

ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం : ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ పిలుపు మేరకు నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజపా అవలంభిస్తున్న తీరుపై మండిపడ్డారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పి చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తెరాస జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నాయకులు పింగల్ రెడ్డి, జనగాం పాండు, ఆర్కాల గాల్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సందిల భాస్కర్ గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, గుర్రం నర్సింహులు, నిర్మల, అబ్బగాని వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement