Saturday, June 15, 2024

బస్సు, డీసీఎం ఢీ.. వ్యక్తి మృతి

ఆర్టీసీ బ‌స్సు, డీసీఎం ఢీకొని ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. చౌటుప్పల్‌ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై డీసీఎం అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ క్లీన‌ర్‌ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement