Friday, May 17, 2024

ఘనంగా నాగుల చవితి వేడుకలు

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో నాగుల చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుండే మహిళలు పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం, నందన గార్డెన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పాము పుట్టల వద్దకు చేరుకొని నాగులచవితి సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టలో ఆవుపాలు పోసి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు. పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో సందడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement