Sunday, April 28, 2024

TS: నా ఫోనూ ట్యాపింగ్ చేశారు.. వెల్ల‌డించిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

ట్యాపింగ్ పై గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాలి.
ప‌దేళ్ల మోదీ పాల‌న‌ను చూడండి..
ఉగ్ర‌వాదాన్ని త‌రిమేశారు
ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేశారు
ఆయోధ్య రామ మందిర నిర్మాణం జ‌రిగింది
పోలింగ్ రోజున అంద‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోండి..


హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అంబ‌ర్ పేట‌లో ఆయ‌న నేడు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు.. అంత‌కు ముందు ఆయ‌న మాజీ ఉప ప్ర‌ధాని, దివంగ‌త నేత బాబు జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్భంగా న‌గ‌రంలోని బాబు జ‌గ‌జ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పూల మాలలు వేసి నివాళుల‌ర్పించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి పెట్టినా… బీజేపీ వదలదని తేల్చి చెప్పారు.

మోదీ ప‌దేళ్ల పాల‌న‌ను చూసి ఓటేయండి..
రైతులకు కొత్త రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిష‌న్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌ధానిగా మోదీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారన్నారు. బీజేపీ మాట ఇచ్చినట్టుగా రామాలయాన్ని నిర్మించిందన్నారు. దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని మోదీ చేపట్టారని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్లు రెచ్చగొట్టిన ఏ ఒక్క ముస్లిం కూడా రామ మందిరం నిర్మాణాన్ని వ్యతిరేకించ లేదన్నారు. ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి పాకిస్థాన్‌ను ఒంటరిని చేశారన్నారు. 75 ఏళ్ల తర్వాత ఉగ్రవాద దాడుల నుండి భారతదేశంను విముక్తి చేశారని తెలిపారు.

మ‌రోసారి మోదీ గెలిస్తే మూడో ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ ..
మూడోసారి ప్రధానిగా మోదీ కావాలని దేశం కొరుకుంటుందన్నారు. మోడీ మంచి పరిపాలనతో దేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగేలా చేశారన్నారు. గుడ్ గవర్నెన్స్ ఈజీ ఆఫ్ డూయింగ్ లతో దేశానికి మంచి పరిపాలన‌ అందిస్తున్నారన్నారు. దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక దేశంగా నిలుపాలన్నదే మోదీ ఆశయమన్నారు. జాతీయ రహదారులకు విస్తరణ రైల్వే లైన్ లో ఆధునికరణతో మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.

అంద‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాలి..

- Advertisement -

దేశంలో 7 దశలలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మే 13న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయన్నారు. నగర ప్రజలను కొరేది ఒక్కటి అందరూ తమ ఓటు హక్కు వినియోగించాలి, ఓటు మన ప్రాథమిక హక్కు అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం గురించి అబ్దుల్ కలాం ఇంతగా వివరించారో మనకు తెలుసన్నారు. ఎంఐఎం ఉన్న ప్రాంతాలలో 80 శాతం ఓటింగ్ పోల్ అవుతుందన్నారు. మనం నివసించే ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని, పోలింగ్ శాతం పెంచే దిశగా క్యాంపెన్ చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement