Saturday, May 4, 2024

TS: సీతారామ ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌డ‌మే నా జీవిత కాల కోరిక – మంత్రి తుమ్మ‌ల

స‌త్తుప‌ల్లి – తనకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. గోదావరి జలాలు 10లక్షల ఎకరాలు ఇచ్చేందుకు తలపెట్టినది సీతారామ ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పటికే 7 వేలకోట్లకు పైగా ఖర్చు జరిగిందన్నారు. టన్నెల్ రెండు వైపుల నుండి పనులు చేసి పూర్తి చేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. యాతలకుంట టన్నెల్ పూర్తి అయితే బెత్తుపల్లి, లంకా సాగర్ కు నీళ్లు అందుతాయన్నారు. గండుగలు పల్లిలో నాలుగో పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

యాతాల కుంట టన్నెల్ ప్రధానమైందని అన్నారు. నిత్య పర్యవేక్షణతో అధికారులు పనులు పూర్తి చేయాలన్నారు. సత్తుపల్లి నియోజక వర్గానికి సీతారామ ప్రాజెక్ట్ లో ప్రధానమైంది యాతాల కుంట టన్నెల్ అని తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు కోరారు. తనకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటమే అని అన్నారు. ఉభయ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా త‌న‌ దృష్టికి తీసుకురావాలని కోరారు. పనులకు ఆటంకం కలగకుండా చూస్తానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ జిల్లా ప్రజల ఆశ..ఆకాంక్ష అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement