Wednesday, May 8, 2024

Muhurtham Fix – రెండున కాంగ్రెస్ పార్టీలో చేరిక – ఖ‌మ్మంలో బిఆర్ఎస్ ను మించే విధంగా స‌భ – పొంగులేటి

న్యూ ఢిల్లీ – జులై రెండో తేదిన ఖ‌మ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే స‌భ‌లో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్ల‌డించారు.. కొత్త ఢిల్లీలో ఆయ‌న నేడు రాహుల్ గాంధీతో స‌మావేశ‌మ‌య్యారు.. అలాగే ప్ర‌యాంక గాంధీని క‌లిశారు.. ఈ సంద‌ర్భంగా మొత్తం 35 మంది నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నన‌ట్లు ఆ పార్టీ ఒక జాబితాను విడుద‌ల చేసింది.. ఆ జాబితాలో పొంగులేటి, జూప‌ల్లి కృష్ణారావు తదిత‌రుల పేర్లు ఉన్నాయి.. రాహుల్ ను క‌లిసిన అనంత‌రం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ, కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను మించి జులై 2న ఖమ్మం సభ ఉంటుందన్నారు.

వ్యాపారమే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్‌లో చేరేవాడిని కాదన్నారు. ఇప్పటికే తనకు ఇబ్బందులు మొదలయ్యాయని అన్నారు.
తెలంగాణ ఇస్తే మంచి జరుగుతుందని నాడు సోనియా భావించార‌ని,అయితే . అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకపక్షం ఏం చేస్తుందో అందరికీ తెలుసన్నారు. జనవరి 1కి ముందు, తర్వాత కూడా తాను మాట్లాడాన‌ని, ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ప్రజలతో మాట్లాడ‌మ‌న్నారు.. ప్ర‌జ‌ల‌ల‌లో బిఆర్ ఎస్ ప‌ట్ల‌, కెసిఆర్ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని పేర్కొన్నారు… . పదవులొక్కటే మనుషులకు ముఖ్యం కాదంటూ . ప్రాంతీయ పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేశామ‌న‌నారు.. అయితే . కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించామన్నారు పొంగులేటి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే ప్రాంతీయపార్టీ పెట్టలేదన్నారు . భవిష్యత్తు కార్యాచరణపై ఎందరో మేధావులతో చర్చించామ‌ని,. ప్రాంతీయ పార్టీలో చేరాలని మేదావులు సూచించార‌ని పేర్కొన్నారు.. అయితే . రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింద‌ని,. కర్నాటక విజయం మరింత పుంజుకుంద‌ని అన్నారు.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు.


సీఎం కేసీఆర్ స్కీముల పేరుతో మాయ చేస్తున్నారని.. మాయాగారడీలో కేసీఆర్ సిద్ధహస్తుడ‌ని విమ‌ర్శించారు. అన్ని పరిణామాలు బేరీజు వేసుకుని రాహుల్ కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి వివరణ ఇచ్చారు. కేసీఆర్ గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్‌కు రుణపడి ఉన్నారని అన్నారు. ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ రాష్ట్ర ఇచ్చార‌ని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. మాయమాటలతో కేసీఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారని. మూడోసారి మాత్రం కెసిఆర్ ని అధికారంలోకి రానివ్య బోమ‌న్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement