Thursday, February 22, 2024

TS: 150ఏళ్ల నాటి మామిడి చెట్టును పరిశీలించిన ఎంపీ సంతోష్ కుమార్

వికారాబాద్, సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్): వికారాబాద్ అడవుల్లోని 150ఏళ్ల నాటి మామిడిచెట్టును ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పరిశీలించారు. వికారాబాద్ అడవుల నడిబొడ్డున 150ఏళ్ల నాటి మామిడి చెట్టును చూసినందుకు చాలా థ్రిల్‌గా ఉంది. దాదాపు 120 రకాల చెట్లు ఉండడం ఎంతో ఉల్లాసమిస్తుందని, అనంతగిరిలో పర్యటించడం తనకు ఎంతో సంతోషం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రకృతి ప్రేమికుడిగా ఏళ్ల నాటి ఈ మామిడిచెట్టును చూడటం మరచిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. ఇలాంటి సంపదను కాపాడుకుందాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న అనంతగిరిలో పర్యటించడం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపడమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement