Monday, October 14, 2024

వీడియో: బుల్లెట్ బండి పాటకు ఎంపీ కవిత డ్యాన్స్..

‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా..’ ఈ పాల ఇటీవల కాలంలో ఎంత ఫేమస్ అయిందో అందిరికి తెలిసిందే. ఓ పెళ్లి బరాతో వధువు డ్యాన్స్ చేయడంతో అప్పటి నుంచి ఈ పాట ఓ ఊపు ఊపుతోంది. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగుతోంది. ఇక  కుర్రకారును ఉరకలేపిస్తూ.. ఆడపడుచుల్లో ఆనందం ఉప్పొంగి స్టెప్పులేసేలా చేస్తున్న బుల్లెట్ బండి సాంగ్ వింటే సామాన్యులకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా కాలు నిలవడం లేదు… ఆనందంతో స్టెప్పులేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత డ్యాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అనే పాటకు పాదం కదుపుతూ ఓ పెళ్లి వేడుకలో ఇలా స్టెప్పు లేశారు. ఈ పెళ్లి వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.. TRS నాయకుడు ముత్యం వెంకన్న కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన ఎంపీ కవిత ఈ పాట వినగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయారు.. ఇలా పెళ్లి వేదిక పైనే వధూవరులతో కలిసి స్టెప్పులేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement