Friday, May 10, 2024

చెరువుగా మోత్కూర్ మెయిన్ రోడ్డు.. ప్రయాణికులకు ఇక్కట్లు

మోత్కూర్, జులై 27( ప్రభా న్యూస్) గత పది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, భారీ వర్షాలతో మోత్కూర్ పెద్ద చెరువు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండగా, చెరువు పట్టణంలో మెయిన్ రోడ్డు వెంట విస్తరించి ఉండటంతో బృందావన్ కాలువ ద్వారా వస్తున్న వరద నీరు చెరువులోకి వస్తుండడంతో ఎస్బిఐ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో మెయిన్ రోడ్డు కాస్త చెరువును తలపిస్తుంది. అక్కడ చిన్న పిల్లల ఆసుపత్రికి వెళ్లే తల్లిదండ్రులు, చిన్నారులను ఎస్సై శ్రీకాంత్ రెడ్డి దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. మోత్కూర్ పెద్ద చెరువు అలువు పోస్తున్నాడంతో భారీ సంఖ్యలో స్థానికులు ,ప్రజలు యువకులు చేపలు పట్టేందుకు తరలి వెళ్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

గత రాత్రి విద్యుత్ అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. హైదరాబాదు నుండి మోత్కూర్ కు వచ్చే పాఠశాల ,కళాశాలల విద్యార్థులు, ప్రయాణికులు తొర్రూరు సూర్యాపేట బస్సులు రద్దు కావడంతో స్వగ్రామాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలగిరి -అనంతారం బిక్కిర్ వాగు బ్రిడ్జికి ఆనుకొని ఉధృతంగా ప్రవహిస్తున్నలతో మోత్కుర్ నుండి తిరుమల వెళ్లే తొర్రూరు ,సూర్యాపేట బస్సులను రద్దు చేశారు .రాయిగిరి సమీపంలోని కూనూరు రైస్ మిల్లు వద్ద భారీ వృక్షం రోడ్డుపై విరిగి పడడంతో కేసారం మీదుగా అటు మోత్కూరు ..ఇటు హైదరాబాద్ కు వాహనాల్లో తరలి వెళ్తున్నారు .కాటపల్లి వద్ద కల్వర్టు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో కల్వర్టు పక్కనుండి కార్లు ద్విచక్ర వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు.

ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ బిక్కేరు వాగు

తిరుమలగిరి జూలై 27 ప్రభ న్యూస్ – మండలంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు అలుగులు పోస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని బిక్కేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గురువారం తెల్లవారుజామున ఈదురు గాలులకు తొండ వెలిశాల గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగినాయి. చెట్లు కూలిపోయినాయి. మండల తాసిల్దార్ రమణారెడ్డి ఎంపీడీవో ఉమేష్ మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను ఎస్ఐ ప్రసాద్ తదితర అధికారులు బిక్కీర్ వాగును పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement