Sunday, February 25, 2024

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి తామర చెరువులో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు. పాటిబండ్ల మృదుల (40), ప్రజ్ఞాన్ (8), మహాన్ (5) గా తేలింది.
కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement