Sunday, May 5, 2024

కోతుల మూక దాడి…కూలిన ఇల్లు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గుండ్లపహాడ్ గ్రామంలో కోతుల మూక ఒక్కసారే ఇంటి పైకి రావడంతో గ్రామానికి చెందిన అనంతగిరి కిషన్ కు చెందిన ఇల్లు కూలిన సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో కోతులు గుంపులుగా వచ్చి పక్కన ఉన్న వేరే వాళ్ల ఇంటి పై నుండి కిషన్ ఇంటి మీద దూకడంతో రేకులు పగిలి ఇంట్లో ఉండే సామాన్లు ధ్వంసం అయ్యాయి.

కాగా, దాదాపుగా 30వేల రూపాయల ఆస్థి నష్టం జరిగింది.బీద కుటుంబం కావున సంబందిత అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని భాదితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement