Sunday, April 28, 2024

TS | ప్రజల ఆకాంక్షల మేరకే మోడీ సంకల్ప పత్రం.. : కే.లక్ష్మణ్

మెదక్ ప్రతినిది/టేక్మాల్ (ప్రభ న్యూస్) : జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించి మోదీకి బహుమతిగా ఇద్దామని రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం సాయంత్రం టేక్మల్ లో జహీరాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మాట్లాడుతూ బీబీ పాటిల్ తన జీవితంను ప్రజల కే అంకితం చేశారని, ఈ పదేళ్లలో పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రధాన మంత్రి సంకల్ప పత్రం విడుదల చేశారని, దేశంలో పదేళ్లు అద్భుతలు చేశామని, పేదల సంక్షేమం కోసం కృషి చేసినట్లు తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం మహిళ లకు రిజర్వేషన్లు కల్పించామని, నల్ల ధనాన్ని వెలికి తీసి, ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు.

యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని, మోడీ సంకల్ప పత్రం ప్రజల అకాంక్షల మేరకే రూపొందించామని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం లో 34 లక్షల కోట్లు పేదల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం అంటే అవినీతి రహిత ప్రభుత్వం అని అన్నారు. 4 కోట్ల మంది పేదలకు కి ఇండ్లు కట్టించారన్నారు. యూపీలో యోగి నాయకత్వంలో జనారంజక పాలన కొనసాగుతోంది అని తెలిపారు.

లక్ష ఇండ్లు హైదరాబాద్‌లో కట్టిస్థానని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కోట శ్రీనివాస్ ను మించి హాస్యాన్ని పండిస్తారని, కేసీఆర్ మాయల పకీర్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ లు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అని వెల్లడించారు. బీబీ పాటిల్ వెనుక మోడీ ఉన్నారని, బీబీ పాటిల్ మరోసారి ఎంపీ అయ్యాక జహీరాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు.

ఈ సమావేశంలో జహీరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంట్ ప్రభారీ గంగారెడ్డి, బిజెపిసంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రేమేందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణ తార తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement