Tuesday, April 30, 2024

Modi’s Palamur Tour హామీలు నిలబెట్టుకోలేని మోడీ కి తెలంగాణ‌లో అడుగుపెట్టే అర్హత లేదు… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 30 (ప్రభ న్యూస్): ప్రధాని మోడీ ఏం మొహం పెట్టుకొని పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసులు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని భూత్పూర్ రోడ్ లో గల తన ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీపై నిప్పులు జరిగారు. ప్రధాని మోడీకి తెలంగాణలో కాలుమోపే అర్హత లేదని మాట్లాడిన ప్రతిసారి తెలంగాణపై విషం చిమ్మె కుసంస్కృతి కలిగిన వ్యక్తి నేడు ఏ మొకం పెట్టుకొని పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారని విమర్శించారు. గతంలో అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా ఇస్తామని చెప్పి పదేళ్లు ప్రధాని మంత్రి హోదాలో ఉండి కూడా జాతీయ హోదా ఇవ్వకుండానే మళ్లీ అదే వేదికగా పాలమూరు కు ఎలా వస్తున్నారని విమర్శించారు.

. తెలంగాణ ప్రజలను కుల మతాలతో విభజించి వారి మధ్య పెట్టి ఈ ప్రాంతం పచ్చబడకుండా అడ్డుకున్నది మీరు కాదని ప్రశ్నించారు. క ర్ణాటక లో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన మీరు ఎందుకు తెలంగాణా ప్రాజెక్టులపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ఈ ప్రాంత ప్రజల పరిస్థితి ఏమి లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు పౌరుషం కలిగిన వారిని పోరాడి సాధించుకున్న తెలంగాణలో మా డబ్బులతో మేము ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మీరు ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు.
నేడు పాలమూరు లో మీరు ప్రసంగించే వేదిక పై నుంచి చుస్తే కరివెనా,ఉదండపుర్,ప్రాజెక్టులు కనిపిస్తాయని, పక్కనే ఐటీ పరిశ్రమ కూడా కనిపిస్తుందని సీఎం కేసీఆర్ సారథ్యంలో మీరు ఒక్క పైసా నిధులు ఇవ్వకున్నా ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో చూడాలని తెలిపారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలకు అవార్డులు మీరే ఇచ్చి బయటకొచ్చి మీరే తిట్టడం ఇదెక్కడి సంస్కారం అని ఘాటుగా విమర్శించారు. ప్రధాని మోడీ మూడు సార్లు పాలమూరు కు వచ్చీ ఇక్కడి ప్రాంత అభివృద్ధి కి ఏం ప్రకటించారని, పాలమూరు అభివృద్ధికి ఎన్ని నిధులు మంజూరు చేశారని నిలదీశారు.

మీ ప్రక్కన ఉన్న స్థానిక లీడర్లు తమ స్వార్ధ రాజకీయాల కోసం ఈ ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టి గతంలో పాలమూరు ను సర్వనాశనం చేశారని, పచ్చగా బతుకుతున్న ఈ ప్రాంత వాసుల మధ్య మళ్లీ చిచ్చు పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మేము కడుతున్న పన్నుల్లో సగం కూడా మాకు తిరిగి ఇవ్వడం లేదని, కృష్ణానది పక్కనే పారుతున్న పాలమూరు కు ఒకప్పుడు14రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉండేదని,కానీ ఇప్పుడు మా హయాంలో మారుమూల తాండాల్లో కూడ ఇంటింటికీ సురక్షిత మంచి నీరు అందిస్తున్నామన్నారు.
కుల మతాల భావోద్వేగాలతో పబ్బం గడుపుకొవాలని చూస్తే ఇక్కడి ప్రజానీకం చూస్తూ ఊరుకోరు కోరని,యాదాద్రి,మన్యం కొండ లాంటి భవ్యమైన మందిరం నిర్మాణం చేసిన ఘనత మా సీఎం కేసీఆర్ దని వ్యాఖ్యానించారు. మా మూలాల్ని ప్రశ్నించే మీకు ఇక్కడ కాలు మోపే అధికారం లేదని, కృష్ణానది నీటి వాటా తేల్చమని ఒక్క లెటర్ ఇవ్వమని అడిగితే కేంద్రం ఇవ్వటం లేదని, ఈ ప్రాంత ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలని మంత్రి అన్నారు. మా పై ఎంత కుట్రలు చేసిన రెట్టింపు స్థాయిలో ఆ ప్రయత్నాన్ని ప్రజలే తిప్పి కొడతారని,మా హాయాంలో ఐటీ మరియు మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా వేలాది మంది యువతకు స్కిల్ డెవలపమెంట్ చేసి ఉద్యోగాలు కల్పించేలా మందుకెళ్తున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు తెలంగాణలో విలీనం చేసుకొమ్మని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు.
ప్రధాని పాలమూరు కు ఏం లబ్ది చేకూర్చ బోతున్నారో ప్రకటించా కే పాలమూరు అడుగు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా పార్లమంటులో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని కోరారు.పాలమూరులో 26 వేల ఎకరాల్లో జంగిల్ సఫారీని ఏర్పాటు చేయబోతున్నామని, దేశ వ్యాప్తంగా ప్రజలు పాలమూరుకు వచ్చే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు.కేసీఆర్ లాంటి సీఎం దేశంలో ఉన్నారంటే ప్రధానిగా మీరు గర్వ పడాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement