Wednesday, May 1, 2024

TS: రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్ ను జాతికి అంకితం చేసిన మోడీ

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోడీ.. రూ.7 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగా సభలో మోడీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు అయ్యిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు.

రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభించాం.. ఎన్టీపీసీ రెండో యూనిట్ 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement