Friday, May 3, 2024

MLC Kavitha – ఈ ఎన్నికల్లో అన్ని సీట్లలో బిజెపికి డిపాజిట్ ట్లు గల్లంతు

సోలాపూర్‌ – గత ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. మూడోసారి సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని.. హ్యాట్రిక్‌ కొడుతారన్నారు.

సోలాపూర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. గత పదేళ్లలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ ఎస్టీ, బీసీ సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గేలిపిస్తాయన్నారు. సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement