Friday, May 3, 2024

అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాల‌న్న ఎమ్మెల్యే కొప్పుల‌

గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ కరణం అరవింద్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు శాఖల అంశాల పై చర్చ జరిగిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామాల అభివృద్ధి లక్షంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతికి జానాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు, వన నర్సరీలు నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో మిగిలి వున్నా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. 33 శాతం అడవులు పెంచేందుకు హరితహారం కింద చెట్లు పెంచడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక రకాలుగా చేయూతనిస్తుందన్నారు. రాష్ట్రంలో కరెంట్, నీటి సమస్య ల పరిష్కారం సీఏం కేసిఆర్ పుణ్యమే అన్నారు. దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి జీపీ కి పార్టీల కతీతంగా సిడిపి నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ కుమార్, ఎంపీడీఓ శర్మ, పంచాయత్ రాజ్ డీఈఈ సుదర్శన్ రెడ్డి, ఏడీఎ జె.వి రాధిక, వైస్ ఎంపీపీ సత్య నారాయణ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement