Saturday, March 2, 2024

న‌ల్ల‌పోచ‌మ్మ ఆల‌యంలో బోనాల ఉత్స‌వాలు…బోనం స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే బేతి..

ఉప్పల్ డివిజన్: ఉప్పల్ డివిజన్ ఏషియన్ థియేటర్ ఎదురుగా గల శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో నేడు జ‌రిగిన బోనాల పండుగ ఉత్సవాలలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. అలాగే ముఖ్య అతిథిగా హాజ‌రైన ఆయ‌న అమ్మవారికి బోనం స‌మ‌ర్పించారు..

ఈ కార్యక్రమం లో ఉప్పల్ గ్రామ పెద్దలు మేకల శివారెడ్డి, పోగుల దయాకర్ రెడ్డి, సల్ల రాజిరెడ్డి, బిక్కుమల్ల అంజయ్య గుప్తా, కుమ్మరి నారాయణ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, వేముల సంతోష్ రెడ్డి, మస్క సుధాకర్,సత్యపాల్ రెడ్డి, నయా వెంకట్రావు, అన్య వెంకటేష్, వేముల వెంకట్ రెడ్డి ,గుర్రాల వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement