Tuesday, July 16, 2024

నవాబ్ పేట మండలంలో మంత్రుల సుడిగాలి పర్యటన

రాష్ట్ర మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డిలు రంగారెడ్డి జిల్లాలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలంలో మంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. శంకుస్థాపనలు… ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎక్ మామిడి, పుల్ మామిడి, లింగం పల్లి, ఎల్లకొండ, మహేతాబ్ ఖాన్ గూడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటనలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పలు రోడ్ల పనులకు శంకుస్థాపనలు, నవాబ్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ లాబ్, ఎమ్మార్సీ భవనాలను మంత్రులు సబితా రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర విద్య, మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement