Tuesday, June 18, 2024

NLG: మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన‌ మంత్రి ఉత్తమ్

నేరేడుచర్ల, జనవరి 26 (ప్రభ న్యూస్) : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

బోర్లు, బావులు ఆధారంగా చేసుకుని రైతులు సాగు చేస్తున్న రబీ పంటలను కాపాడేందుకు, అలాగే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలను పెంపొందించేందుకు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల విషయమై పరిశీలిస్తామన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement