Wednesday, May 1, 2024

MBNR: ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి, రాజకీయ నేతలు, అధికారులు

మహబూబ్ నగర్, నవంబర్ 30 (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలంతా గత పదేళ్ల క్రితం ఓటెయ్యడానికి వెళ్ళినప్పుడు అనేక సమస్యలతో వెళ్లారని, అప్పుడు తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఓటెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.

గత 70 ఏళ్ల సమస్యలను, ఇప్పుడు తీరిన సమస్యలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని మాట్లాడారు. అప్పటి వలస జీవితాలను, దుర్భర బతుకులను మననం చేసుకుంటున్నారని, తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితులను ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి తమకు మరింత మెజారిటీ వస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రశాంతమైన మహబూబ్ నగర్ చేయడమే తమ ధ్యేయమన్నారు.

- Advertisement -

కొడంగల్ ప్రభుత్వ పాఠశాల లో ఓటు హక్కు వినియోగించుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.

ఓటు హక్కు వినియోగించుకున్న దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి జీఎంఆర్…

దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామంలో 186వ బూత్ లో దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి.మధుసూదన్ రెడ్డి క్యూ లైన్ లో నిలుచుని కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బూతు నెంబర్ 103 పద్మావతి కాలనీలో గల ప్రతిభ జూనియర్ కళాశాలలో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న డీకే అరుణ…
గద్వాల జిల్లా కేంద్రంలోని కోట కాలేజీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ బూత్ నంబర్ 261 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఆమె భర్త మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి, కూతురు డీకే స్మిగ్దా రెడ్డిలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం అభివృద్ధి కోసం బిజెపి పార్టీని గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు. గతంలో 10 సంవత్సరాలు ఇతర పార్టీలను చూసామని అంతకు ముందు కూడా వేరే పార్టీలను చూసామని ఈరోజు తెలంగాణలో అభివృద్ధి కోసం బిజెపి పార్టీని ఆదరిస్తారని విశ్వాసం ఉందన్నారు.

మక్తల్ పట్టణంలోని 161వ పోలింగ్ బూతులో తన సతీమణి తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి

మక్తల్ పట్టణంలోని 167వ పోలింగ్ బూతులు ఓటు హక్కు వినియోగించుకున్న బి.ఆర్.ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు

మక్తల్ అసెంబ్లీ స్థానానికి ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు 9.67 శాతం పోలింగ్ నమోదయింది

కోస్గి మండలం మీర్జాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి

మక్తల్ అసెంబ్లీ స్థానానికి ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు 24.56 శాతం పోలింగ్ నమోదయింది.

కోస్గిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన టీపీసీసీ చీఫ్

కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో 148,149,150 బూతులను పరిశీలించి పరిశీలించి ఓటింగ్ సరళని అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి.
అనంతరం కామారెడ్డి కి ప్రయాణం.

ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల (ప్రతినిధి) పురపాలక సంఘం పరిధిలోని వేణు కాలనీలోని 215 పోలింగ్ స్టేషన్ నందు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తమ ఓటు ను వినియోగించుకున్నారు.

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం వర్కూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద బిఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని గ్రామస్తులు అడ్డుకున్నారు.. ఈ సందర్భంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ వాతవరణం నెలకొంది.

మక్తల్ లో మధ్యాహ్నం 1గంటకు 42.31శాతం పోలింగ్..

నారాయణపేట జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. మక్తల్ నియోజవర్గంలో 1:00 గంటల వరకు 42.31 శాతం పోలింగ్ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement