Monday, May 20, 2024

TS: మోకాలి సర్జరీ కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి భరోసా.. రూ.లక్ష ఎల్వోసీ అందజేత

వేల్పూర్, ఆగస్టు 24 (ప్రభ న్యూస్): వేల్పూర్ మండలంలోని సాహెబ్ పేట్ గ్రామానికి చెందిన పి.అశోక్ నిమ్స్ హాస్పిటల్ లో మోకాలి సర్జరీ కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరు చేయించారని సర్పంచ్ సుధాకర్ గౌడ్ తెలిపారు. సంబంధిత ఎల్ఓసి కాపీని వారి కుటుంబ సభ్యులకు మంత్రి గురువారం హైదరాబాద్ మంత్రి నివాసంలో అందజేశారని అన్నారు.

నిరుపేదలమైన తమకు సర్జరీ కోసం లక్ష రూపాయల ఎల్ఓసి మంత్రి మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్ గౌడ్, సాహెబ్ పేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement