Saturday, April 13, 2024

TS: సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామంలో సమ్మక్క సారలమ్మలను మంత్రి పొన్నం ప్రభాకర్ ద‌ర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసంద‌ర్భంగా
అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మంత్రి మొక్కుకున్నారు. సర్వేజన సుఖినొభవంతు అందరు బాగుండాలని
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతుందన్నారు.

అమ్మవారి ఆశీర్వాదంతో రాబోయే కాలంలో సమృద్దిగా వర్షాలు పడి పాడి పంటలతో పిల్లా పాపలతో తెలంగాణ రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్న‌ట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం ఆకాంక్ష అన్నారు. ఈ ప్రాంతంలో పేదల భూములు గుంజుకుంటున్నటువంటి కరీంనగర్ తో పాటు వివిధ పట్టణాల్లో భూదందాలు చేసినవన్నీ బయటపెడతామ‌ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement