Saturday, March 2, 2024

హైదరాబాద్లో మురుగునీరు లేకుండా చర్యలు: కేటీఆర్

హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు గత ఏడేళ్లుగా అనేక మౌలిక వసతుల సదుపాయాలు కల్పించామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో తాగునీటి, విద్యుత్ సమస్య లేకుండా సమస్యలను పరిష్కరించామని తెలిపారు. జలమండలి సమర్థవంతమైన పనితీరు వలన హైదరాబాద్ నగరానికి వాటర్ ప్లస్ సిటీ హోదా దక్కిందని చెప్పారు. 1950 ఎంఎల్డి మురికి నీరు అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాదులో ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉత్పత్తి అవుతున్న మురుగులో 46.8 శాతం ట్రీట్మెంట్ తెలిపారు.

హైదరాబాద్ నగరంలో సాగునీటి వనరులను పరిశుభ్రం చేయాలంటే… ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని 100% పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతమున్న జిహెచ్ఎంసి లోని 1650 mld తో పాటు భవిష్యత్తులో కూడా వచ్చే మురుగు నీటి శుద్ధి కోసం stp ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.

STP ల నిర్మాణంతో మురుగు నీటి సమస్య తీరుతుందన్నారు. దీంతోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలలోనూ ఈ మురుగునీటి శుద్ధి కోసం అదనంగా 1200 కోట్ల నిధులను సీఎం కేటాయించారని తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ తో పాటు నగర పరిసర ప్రాంతాల్లోని మురుగు నీటి సమస్య నివారణ కోసం ఒకేరోజు తెలంగాణ ప్రభుత్వం 5000 కోట్ల రూపాయల నిధులను ప్రకటించిందని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరానికి ఇంత భారీ ఎత్తున నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement