Monday, April 29, 2024

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని మంత్రి కొప్పుల అన్నారు. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మను ఉక్కు మహిళ అని పేర్కొన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటముందని, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప నిదర్శనం అని మంత్రి కొప్పుల కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement