Friday, October 4, 2024

Rides: మాజీ సర్పంచ్ ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు

భద్రాచలం టౌన్, నవంబర్ 27(ప్ర‌భ‌న్యూస్‌)
భ‌ద్రాచారం మాజీ స‌ర్పంచ్ భూక్యా శ్వేత ఇంట్లో అర్థ‌రాత్రి త‌నిఖీలు జ‌రిగాయి. ఐటీ అధికారులంటూ అర్థ‌రాత్రి వ‌చ్చి అధికారులు త‌నిఖీలు చేశారు. ఇటీవల బిఆర్ఎస్ పార్టీ నుంచి బాలసాని ఆధ్వర్యంలో భూక్య శ్వేత దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరాలంటూ ఇటీవలే కొందరు కీలక నేతలు సంప్రదింపులు చేశార‌ని, పార్టీ మారడం కుదరదని భూక్య శ్వేత దంపతులు స్పష్టం చేసిన‌ట్లు చెప్పారు. పార్టీలు మారకపోతే దాడులు చేస్తారా అంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పై కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement