Sunday, October 6, 2024

IT Raids – ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంటిలో ఐటీ సోదాలు

ఆలంపూర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారిపై ఐటీ రైడ్స్ జరగ్గా తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. శాంతినగర్ లోని సంపత్ కుమార్ ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.. .కొంతమంది ఇచ్చిన సమాచారంతో.. ఐటీ అధికారులూ, పోలీసులు.. అర్థరాత్రి.. వడ్డేపల్లి మండలం, శాంతినగర్ లోని సంపత్ కుమార్ ఇంటికి వెళ్లారు.

గత రాత్రి 12 గంటల సమయంలో ఐటీ, విజిలెన్స్  అధికారులు సంపత్ ఇంటికి చేరుకుని సోదాలతో కంగారుపడిపోయిన సంపత్ భార్య మహాలక్ష్మి హైబిపికి గురయి స్ఫృహతప్పి పడిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి.. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులూ అక్కడికి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement