Monday, May 6, 2024

ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా..

కొబ్బరి బోండం నీటిని వారం క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటున్నాయంటున్నారు నిపుణులు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడుతలు రావడం తగ్గి వయస్సు తక్కువ కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపర్చడానికి తోడ్పడుతాయి. గర్బిణులు నిత్యం కొబ్బరినీళ్లు తాగడం వల్ల గర్భాశయంలో ఉన్న సమస్యలు తగ్గి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు

మెదక్‌రూరల్‌, మే 9 (పభన్యూస్‌) : ప్రకృతి ప్రసాదంగా లభించే కొబ్బరిలో ఎన్నో ఔషదగుణాలు, పోషకాలు ఉన్నాయి. మనం ఉపయోగించే వస్తువులు, ఆహార పదార్థాలు అన్నీ కల్తీ అవుతున్నాయి. కానీ సహజసిద్దంగా కల్తీ లేకుండా ఒక కొబ్బరిబొండా మాత్రం మనకు లభిస్తుంది. కొబ్బరి చెట్టు నుండి వచ్చే ప్రతిదీ మన నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జనం కొబ్బరిబొండాలను ఆశ్రయిస్తుంటారు. కొబ్బరి నీళ్లలో అన్ని రకాల పోషక విలువలు అధికంగా ఉండడంతో వేసవిలో కొబ్బరి బోండాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఆయా ప్రాంతాల నుండి దిగుమతి అవుతున్న కొబ్బరి బోండాలకు 30 నుండి 50 రూపాయల వరకు కూడా ధరలు పలుకుతున్నాయి. ఎక్కువ ధర అయినప్పటికీ కలుషితం కాని స్వచ్ఛమైన నీరు తాగేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు.

కొబ్బరి బోండంలోని పోషక విలువలు..
కొబ్బరి బోండం నీటిని వారం క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటున్నాయంటున్నారు నిపుణులు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడుతలు రావడం తగ్గి వయస్సు తక్కువ కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపర్చడానికి తోడ్పడుతాయి. గర్బిణులు నిత్యం కొబ్బరినీళ్లు తాగడం వల్ల గర్భాశయంలో ఉన్న సమస్యలు తగ్గి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో షుగర్‌ లెవల్‌ పడిపోకుండా చూస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శరీరంలో ఉన్న కొవ్వు, కిడ్నీలోని రాళ్లను కరిగిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచి గుండెను కాపాడుతుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కాల్షియం, మెగ్నీషీయం, పాస్పరస్‌, పోటాషియం, సోడియం వంటి ముఖ్య పోషకాలు కొబ్బరినీళ్లలో పుష్కలంగా ఉండడం వల్ల ఎలాంటి రోగాలైన నియంత్రిస్తుంది. ఎముకలను ధృడంగా చేస్తుంది. వెంట్రుక లు పెరగడానికి దోహదపడుతుంది. విష జ్వరాల భారిన పడి నీరసంగా ఉన్నవారికి కొబ్బరినీళ్లు తాగించడం ద్వారా రక్తంలోని తెల్లరక్త కణాలు పెరుగుతాయి. చిన్న పిల్లలకు కొబ్బరినీళ్లు దివ్యాఔషదంగా పనిచేస్తాయి. కొబ్బరిబోండా నిత్యం తాగడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. షుగర్‌ ఫెషెంట్లు కూడా డాక్టర్‌ సలహామేరకు కొబ్బరి బొండం తాగడం మంచిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement