Friday, May 3, 2024

వీక్లీ పరేడ్ తో సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ : ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

మెదక్ పట్టణ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని హాజరై గౌర‌వ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ప్రదర్శనని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని, చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని మెదక్ జిల్లాకి, తెలంగాణ పోలిస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జ‌రిగింద‌న్నారు. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. అనంతరం సిబ్బంది యొక్క సమస్యలను విని వాటి పరిష్కారానికి సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement