Friday, April 26, 2024

ఆలయాల నిర్మాణాలకి ఎమ్మెల్యే జీఎంఆర్ చేయూత

ప్రభ న్యూస్, గుమ్మడిదల : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గ్రామదేవతల ఆలయాల నిర్మాణం కోసం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ సొంత నిధులతో ఆలయాల నిర్మాణానికి పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముందుకు వెళుతున్నారని వీరన్న గూడెం గ్రామ సర్పంచ్ పొన్నబోయిన మమతా వేణు అన్నారు. తాజాగా గుమ్మడిదల మండలం వీరన్న గూడెం గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులచే నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మరియు బొడ్రాయి లింగమయ్య స్థాపన మహోత్సవ కార్యక్రమాలు గురువారం భక్తిశ్రద్ధలతో భక్తుల జయ జయ ధ్వనాల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామ దేవతలైన పోచమ్మ దుర్గమ్మ కరుణాకటాక్షాలు ప్రజల సహాయ సహకారాలతో దేవాలయాల అభివృద్ధికి, పునర్నిర్మాణాలకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడమే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గ వ్యాప్తంగా కుల మతాలకతీతంగా ప్రతి ఒక్క ఆలయ నిర్మాణానికి తన సహాయ సహకారాలను అందజేస్తూ సొంత నిధులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్, సర్పంచ్ మమత వేణు, ఉప సర్పంచ్ కుమార్ దోమడుగు సర్పంచ్ రాజశేఖర్ , ఎంపీటీసీలు సురభి నాగేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సద్ది విజయభాస్కర్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, గణేష్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, నరహరి, లక్ష్మీనారాయణ, ఎజాజ్ పాషా, యాదగిరి, మోహన్, చంద్రశేఖర్, విజయ్, సత్యనారాయణ, వినోద్ గౌడ్, రమేష్ అప్ప, బిక్షపతి రెడ్డి, షఫీ, గోపాల్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement