Tuesday, May 21, 2024

MDK : నీలం మ‌ధును గెలిపించుకుంటాం

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ, సబ్బండ వర్గాలకు చెందిన నీలం మధుకి రోజు రోజుకి అభిమానుల నుంచి అనూహ్యoగా మద్దతు లభిస్తోంది. ఆయనను కలిసేందుకు ఉదయం నుంచే అభిమానులు వస్తున్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటున్నారు.

- Advertisement -

సోమవారం సైతం మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన అభిమానులు అభ్యర్థి నీలం మధుని ముదిరాజును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే పార్లమెంట్ ఎన్నికలలో తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికలలో తమ వెంట ఉండి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నీలం మధుకి హామీనిచ్చారు.

నీలం మధుని కలిసిన వారిలో బీరంగూడకు చెందిన ముస్లిం మైనారిటీ నేత సత్తార్ అనుచరులు, వెల్దుర్తి రవీందర్ గౌడ్, గొల్లపల్లి సదాశివ గౌడ్, చంద్రపూర్ లింగం, ఆందూర్ సాయిరాం, కమ్మపల్లి అబిరాజ్, కంచనపల్లి రాములు, మార్కుర్ సత్యనారాయణ, జగదేవ్‌పూర్ రాజు, చేగుంట బిక్షపతి, పటేల్ గూడా హనుమంత రెడ్డి, కొత్తూరు రవి, జిన్నారం మహేష్, దుబ్బాక తేజ, పటాన్‌చెరు దస్తగిరి తమ తమ అనుచరులతో నీలం మధుని కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement